NTV Telugu Site icon

టీ గోల్ఫ్‌కు కంగారులు ఫిదా…

క్రికెట్‌, ఫుట్‌బాల్‌కు ఉన్నంత ఆద‌ర‌ణ గోల్ప్ గేమ్‌కు లేక‌పోయినా, దానిని రాయ‌ల్టీ గేమ్ అని పిలుస్తుంటారు.  చూసేందుకు సింపుల్‌గా అనిపించినా చాలా టిపిక‌ల్ గేమ్ ఇది.  ఖ‌ర్చుతో కూడుకొని ఉంటుంది.  ఆ గేమ్‌లో పురుషుల‌తో పాటుగా మ‌హిళ‌లు రాణిస్తున్నారు.  ఆస్ట్రేలియాలోని అరుణండ‌ల్ హిల్ గోల్ప్ కోర్స్‌లో నిత్యం గోల్ప్ క్రీడ‌లు జ‌రుగుతుంటాయి.  ఈ గేమ్స్ చూసేందుకు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున అక్క‌డికి వ‌స్తుంటారు.  ఇక‌, గోల్ప్ గేమ్ క్రీడాకారిణి టీ త‌న గోల్ప్ స్టిక్‌తో బాల్‌ను కొట్ట‌బోతున్న త‌రుణంలో అనుకోకుండా అక్క‌డికి అనేక‌మంది అతిథులు వ‌చ్చి మైదానంలో నిలుచున్నారు.  

Read: తిరుప‌తిలో ప‌రుగులు తీయ‌నున్న ఎల‌క్ట్రిక్ బ‌స్సులు…

వాటిని చూసి టీ మొద‌ట షాక‌యింది.  వెంట‌నే తేరుకొని వాటివైపు అలా చూస్తుండిపోయింది.  కాసేపు అక్క‌డే నిల‌బ‌డిన కంగారులు అక్క‌డి నుంచి మెల్లిగా వెల్లిపోయాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు ఆ గోల్ప్ కోర్స్ మైదానంలో కంగారుల‌ను చూడ‌లేద‌ని, మొద‌టిసారి అన్ని కంగారులు అక్క‌డికి రావ‌డంతో కంగారుప‌డిపోయిన‌ట్టు క్రీడాకారులు, ప్రేక్ష‌కులు చెబుతున్నారు.  టీగోల్ప్‌కు ఫిదా అయిన కంగారుల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.