NTV Telugu Site icon

Boats Overturn: కాలిఫోర్నియా తీరంలో పడవలు బోల్తా.. 8 మంది మృతి

Boat

Boat

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా తీరంలో విషాదం చోటుచేసుకుంది. వలసదారుల అక్రమ రవాణా ఆపరేషన్‌లో రెండు పడవలు బోల్తా పడడంతో ఎనిమిది మంది మరణించారు. ప్రమాదం సమయంలో రెండు బోట్లలో దాదాపు 23 మంది ఉన్నారని అధికారులు చెప్పారు. ఒక ఓడలో ఎనిమిది, మరో బోట్లో 15 మంది ఉన్నారు. శాన్ డియాగో, మెక్సికన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టోర్రే పైన్స్ బీచ్‌లో బోల్తా పడింది.

Also Read: Oscars 95: ఇండియాకి మొదటి ఆస్కార్ వచ్చేసింది…
శాన్ డియాగో యొక్క బ్లాక్స్ బీచ్ తీరంలో ఫిషింగ్ బోట్‌ల గురించి స్పానిష్ మాట్లాడే వ్యక్తి నుండి సమాచారం అందుకున్న తర్వాత శాన్ డియాగో అత్యవసర సిబ్బంది శనివారం అర్థరాత్రి సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. బోల్తా పడిన రెండు ఫిషింగ్ బోట్‌లను గుర్తంచారు. బీచ్‌లో ఎనిమిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు శాన్ డియాగో ఫైర్-రెస్క్యూ లైఫ్‌గార్డ్ డివిజన్ చీఫ్ జేమ్స్ గార్ట్‌ల్యాండ్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు, సముద్రపు స్మగ్లింగ్ ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాత్రిపూట రెస్క్యూ ప్రయత్నాలకు ఆటంకం కలిగించిందని అధికారులు తెలిపారు. U.S. కోస్ట్ గార్డ్ , శాన్ డియాగో ఫైర్-రెస్క్యూ లైఫ్‌గార్డ్ విభాగం ఆదివారం ఉదయం కూడా రికవరీ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. వందల వలసదారుల అక్రమ రవాణా సంఘటనలలో ఇదీ ఒకటి అని అధికారులు తెలిపారు.