ఫిజీలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఫిజీ దక్షిణ పసిఫిక్‌లోని ఒక దేశం. ఇది 300 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ద్వీపసమూహం.
భూకంపం ఉదయం 10.01 గంటలకు సంభవించింది. ఫిజీకి 569 కి.మీ లోతులో తాకినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ( NCS) తెలియజేసింది. ఇంకా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వారం వ్యవధిలో ఇది రెండో భూకంపం. అంతకుముందు, గురువారం, రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం ఫిజీని తాకినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది.