Site icon NTV Telugu

క్రూజ్‌ షిప్పులో క‌రోనా క‌ల‌క‌లం… 48 మందికి పాజిటివ్‌…

ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద క్రూజ్ షిప్పుగా పేరుగాంచిన ది రాయ‌ల్ క‌రేబియ‌న్ సింఫ‌నీ ఆఫ్ సీస్ ఇప్పుడు క‌రోనా క్ల‌స్ట‌ర్‌గా మారిపోయింది.  ఈ షిప్పులో 6 వేల మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేస్తుండ‌గా అందులో ఒక‌రు అనారోగ్యం బారిన ప‌డ్డారు. షిప్పులోనే ఆమెకు టెస్టులు చేయ‌గా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగింది.  వెంట‌నే ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న వారికి టెస్టులు నిర్వ‌హించారు.

Read: వైర‌ల్‌: రోడ్డుపై డ‌బ్బులు విసిరేసిన బిచ్చ‌గాడు… షాకైన ప్ర‌జ‌లు…

మొత్తం 48 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌ర‌గ‌డంతో షిప్పులు ఫ్లోరిడాలోని మియామీ బీచ్‌లో నిలిపివేశారు.  రాయ‌ల్ క‌రేబియ‌న్ సింఫ‌నీ ఆఫ్ సీస్ క‌రోనా క్ల‌స్ట‌ర్‌గా మారింది.   ఈ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.  వీరికి సోకింది క‌రోనా పాజిటివ్‌నా లేక ఒమిక్రాన్ వేరియంటా అన్న‌ది తెలియాల్సి ఉంది.  క‌రోనా సోకిన 48 మందికి షిప్పులోనే ఐసోలేష‌న్‌లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.  

Exit mobile version