3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్రను ప్రారంభించారు. గత నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర 45 రోజుల పాటు సాగనుంది. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర నేడు 42వ రోజు పాదయాత్ర అంజిమేడులో ప్రారంభం కానుంది. అయితే అంజిమేడు నుంచి 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగి రేణిగుంటకు చేరుకోనుంది. రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది.
ఊరురా ప్రజలు, రైతులు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ పాదయాత్రకు మద్దతు తెలుపుతూ పాల్గొంటున్నారు. 45వ రోజు తిరుమలలో ఈ పాదయాత్ర ముగుస్తుంది. అలాగే ఈ నెల 17 తిరుపతి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అమరావతి రైతుల జేఏసీ నిర్ణయించింది. బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అమరావతి జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించనున్నారు.