NTV Telugu Site icon

12 బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీ..!

బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎప్పుడూ తీవ్రమైన పోటీయే ఉంటుంది.. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ) ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే.. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు… ప్రభుత్త గణాంకాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ నాటికి దేశ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు నిర్మలా సీతారామన్‌..

Read Also: పీఆర్సీపై కొనసాగుతోన్న ఉత్కంఠ..!

ఇక, దాంట్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎబ్సీఐ)లో గరిష్ఠంగా 8,544 పోస్టులు ఖాళీగా ఉండగా.. పీఎన్‌బీలో 6,743, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 6,295, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో 5,112, బీవోఐలో 4,848 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఓ ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన నిర్మలా సీతారామన్‌.. దేశవ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 8,05,986కు పైగా స్థానాలున్నాయని, ఇందులో ఆఫీసర్లు, క్లర్కులు, సబ్‌-స్టాఫ్‌ హోదాల్లో 41,177 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. మరి, ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కేంద్రం.