NTV Telugu Site icon

ఈ చేప‌ల‌తో జాల‌ర్ల‌కు భారీ లాభాలు…

Telia Bhola Fish

స‌ముద్రాన్ని న‌మ్ముకొని జీవ‌నం సాగించే జాల‌ర్ల‌కు ఎప్పుడో ఒక‌ప్పుడు అదృష్టం క‌లిసి వ‌స్తుంది.  అందులో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.  చాలా కాలంగా ప‌శ్చిమ బెంగాల్‌లోని దిఘా జాల‌ర్లు స‌ముద్రంలో చేప‌ల వేట‌ను కొన‌సాగిస్తున్నారు.  క‌రోనా స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎప్ప‌టికైనా మంచి రోజులు వ‌స్తాయ‌ని వేట‌ను కొన‌సాగిస్తున్నారు.  ఎప్ప‌టిలాగే 10 మంది జాల‌ర్లు చేప‌ల వేట‌కు స‌ముద్రంలోకి వెళ్లారు.  అనూహ్యంగా వారి వ‌ల‌కు అరుదైన జాతికి చెందిన 33 తెలియా భోలా చేప‌లు చిక్కాయి.  ఈ చేప ఒక్కొక్క‌టి 33 నుంచి 35 కిలోల బ‌రువు ఉన్న‌ది.  33 చేప‌ల‌ను వేలంలో రూ.1.40 కోట్ల ధ‌ర‌ల‌కు అమ్ముడుపోయాయి.  ఎంతో కాలంగా చేప‌ల వేట కొనసాగిస్తున్నామ‌ని, కాని, ఇలా అరుదైన చేప‌లు దొర‌క‌డం అదృష్టంగా భావిస్తున్నామ‌ని మ‌త్స్య‌కారులు పేర్కొన్నారు.  వేలంలో ఓ ఫార్మా కంపెనీ ఈ చేప‌ల‌ను కొనుగోలు చేసింది.  ఇలాంటి చేప‌లు స‌ముద్రంలో స‌మూహాలుగా తిరుగుతుంటాయ‌ని, అవి ఒక‌ప‌ట్టాన వ‌ల‌కు చిక్క‌వ‌ని స‌మూహాల నుంచి విడిపోయిన స‌మ‌యంలో మాత్ర‌మే అవి ఇలా దొరుకుతుంటాయ‌ని మ‌త్స్య‌కారులు పేర్కొన్నారు.  

Read: డేటింగ్ యాప్ లో అమ్మాయిలు.. నగ్నంగా ఫొటోలు.. టెంప్ట్ అయిన 40 మంది చివరికి