Site icon NTV Telugu

3 లోక్ సభ, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మూడు లోక్​సభ, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్​ 30న ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి.

అసోం- 5, బంగాల్​- 4, మధ్యప్రదేశ్​, హిమాచల్​ ప్రదేశ్​, మేఘాలయ- 3, బిహార్​, కర్ణాటక, రాజస్థాన్​- 2, ఆంధ్రప్రదేశ్​, హరియాణా, మహారాష్ట్రా, మిజోరాం, తెలంగాణలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. అక్టోబర్​ 30న ఉప ఎన్నికలు జరిగిన స్థానాల్లో గతంలో బీజేపీ ఆరు, కాంగ్రెస్​ తొమ్మిది, మిగిలినవి స్థానిక పార్టీలు గెలుపొందాయి. తెలుగు రాష్ట్రాల్లో బద్వేల్ స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య ప్రాణాలు కోల్పోయారు. హుజురాబాద్ స్థానంలో తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజారాబాద్​ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి.

దాద్రా నగర్​ హవేలీ, హిమాచల్​ప్రదేశ్​లోని మండి, మధ్యప్రదేశ్​లోని ఖాంద్వా లోక్ సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లోని ఎంపీలు మరణించిన క్రమంలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. మండి స్థానంలో బీజేపీ అభ్యర్థి రామస్వరూప్​ శర్మ, ఖాంద్వాలో బీజేపీ నేత నంద కుమార్​ సింగ్​, దాద్రా నగర్​ హవేలీలో స్వతంత్ర నేత మోహన్​ దెల్కార్​ ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఈ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలకు జరిగిన పోలింగ్ అనంతరం మంగళవారం కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version