NTV Telugu Site icon

తగ్గనంటున్న కరోనా.. భారత్‌లో కొత్తగా 2,71,202 కేసులు..

దేశంలో కరోనా తగ్గనంటోంది. రోజురోజుకు కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరుతూవస్తున్నాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. థర్డ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ కర్ఫ్యూలు విధించాయి. ఏపీలో కూడా ఈ నెల 18 నుంచి నైట్‌ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూపై లాంటిది ఏమైనా విధిస్తారా అని తెలంగాణవాసులు చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా దేశవ్యాప్తంగా 2,71,202 కరోనా కేసులు రాగా, 314 మంది మరణించారు. అయితే గడిచిన 24 గంటల్లో 1,38,331 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,50,377 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది. దీనితో పాటు దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యం 7,743కు చేరుకుంది.