NTV Telugu Site icon

వైర‌ల్‌: సింహంపై ప్రేమ‌తో ఎన్‌క్లోజ‌ర్‌లోకి దూకిన యువ‌తి… ఆ త‌రువాత‌…

జూకు వెళ్లిన‌పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులు చెబుతుంటారు.  అనుక్ష‌ణం అధికారులు ఎన్‌క్లోజ‌ర్ ల‌ను ప‌రిశీలిస్తుంటారు.  ఇక సింహాలు, పులులు ఉండే ఎన్‌క్లోజ‌ర్‌ల వ‌ద్ద భ‌ద్ర‌త మ‌రింత క‌ట్టుదిట్టంగా ఉంటుంది.  ఇలాంటి క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉన్న‌ప్ప‌టికీ ఓ మ‌హిళ సింహం ఉన్న ఎన్‌క్లోజ‌ర్‌ను దాటుకొని లోనికి వెళ్లింది.  

Read: బాల‌కృష్ణ ఓ అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి: పేర్ని నాని

అక్క‌డ డ్యాన్స్ చేస్తూ డ‌బ్బులు విసిరేసింది.  ఐ ల‌వ్ యు కింగ్ అంటూ ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది.  అయితే, సింహం ఆమెకు కాస్త దూరంగా ఉన్న‌ది.  ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని గ‌మ‌నించిన జూ సిబ్బంది వెంట‌నే అమెను జాగ్ర‌త్త‌గా ఎన్‌క్లోజ‌ర్ నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. గ‌తంలో కూడా ఆమె అలానే ఎన్‌క్లోజ‌ర్‌లోకి వెళ్లి హ‌డావుడి చేసిన‌ట్టు అధికారులు గుర్తించారు.  ఈ సంఘ‌ట‌న అమెరికాలోని న్యూయార్క్‌లో జ‌రిగింది.