Site icon NTV Telugu

ఒమిక్రాన్‌పై బాంబు పేల్చిన WHO.. కోవిడ్‌ టీకా పనిచేస్తేలేదంట..!

యావత్త ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి కొత్త కొత్త రూపాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మొన్నటి వరకు ప్రపంచ దేశాలు డెల్టా వేరియంట్‌తోనే సతమతవుతున్నాయి. ఇప్పడిప్పుడే కొన్ని దేశాలు డెల్టా వేరియంట్‌ నుంచి బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పడు ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వేరియంట్‌ ఇటీవల భారత్‌లోకి కూడా ప్రవేశించి తన ప్రభావాన్ని చూపుతోంది.

అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు బూస్టర్‌ డోసులు ఆస్కారం ఉంటుందని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. ఇప్పుడు మరో విషయాన్ని వెల్లడించింది. ఒమిక్రాన్‌పై శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించి దీని ప్రభావం చాలా వేగంగా ఉందని వెల్లడించారు. అంతేకాకుండా ఒమిక్రాన్‌ వేరియంట్‌పై కోవిడ్‌ టీకా ప్రభావం చూపటంలేదని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. టీకా తీసుకున్నా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అంతేకాకుండా దీనిపై మరింత అధ్యయనం అవసరమని పేర్కొంది.

Exit mobile version