Site icon NTV Telugu

బి ‘కేర్’ ఫుల్: ఆ నంబర్లన్నీ.. నకిలీ నంబర్లే!

ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో గూగుల్ లేనిది గడవటం చాలా మందికి కష్టంగానే మారింది. అంతేకాదు, ఏ చిన్న సమస్య వచ్చిన గూగుల్ మీదే ఆధారపపడుతున్నారు. సరిగ్గా ఇక్కడే సైబర్ నేరగాళ్లు కూడా మోసానికి పాల్పడుతున్నారు. వివిధ రంగాల సంస్థల కస్టమర్‌ కేర్‌ సహాయం కోసం మనం గూగుల్‌లో వెతుకుతున్న నెంబర్లన్నీ.. దాదాపు నకిలీ నంబర్లే అని సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సహాయం కోసం కాల్ చేసిన వెంటనే వారి నుంచి వచ్చే ఓటీపీ మెసేజీలతో మోసాలు జరుగుతున్నాయని పోలీసులు సూచిస్తున్నారు. కొందరు మోసగాళ్లు అవసరమైతే గూగుల్‌ యాడ్స్‌ కొనుగోలు చేసి.. ఈ వివరాలను పోస్ట్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్‌ కేర్‌ నంబర్‌ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. ప్రతి సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌ నుంచే నెంబర్ తీసుకోవాలని సైబర్‌క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

Exit mobile version