NTV Telugu Site icon

Longest River Cruise: గంగానదిలో ప్రపంచంలోనే అతిపొడవైన రివర్ క్రూయిజ్.. ప్రారంభించనున్న ప్రధాని

Longest River Cruise

Longest River Cruise

Longest River Cruise: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 13న జెండా ఊపి ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వారణాసిలోని గంగానది ఒడ్డున టెన్త్‌ సిటీని ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ షిప్ టూరిజం సర్క్యూట్‌ను జనవరి 13న వారణాసిలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గంగానది, బ్రహ్మపుత్ర నదులపై 51 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. ఈ సందర్భంగా రూ. వెయ్యి కోట్ల కంటే విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గంగా విలాస్ వారణాసి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి 51 రోజుల్లో 3,200 కి.మీ ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ చేరుకుంటుంది, రెండు దేశాల్లోని 27 నదీ వ్యవస్థల మీదుగా ప్రయాణిస్తుంది. 51 రోజుల రివర్ క్రూయిజ్ ప్రయాణం దేశంలో సాంస్కృతిక మూలాలను అనుసంధానించడానిక ఒక ప్రత్యేకమైన అవకాశం అని ప్రధాని మోదీ అన్నారు.

ఈ క్రూయిజర్‌లో మూడు డెక్‌లు, 18 సూట్‌లు ఉన్నాయి. ఇందులో 36 మంది పర్యాటకులను తీసుకెళ్లే సామర్థ్యం, అన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. వారణాసిలో 13న ప్రారంభమయ్యే ఈ షిప్ టూరిజంలో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన 32 మంది పర్యాటకులు ప్రత్యేకంగా ప్రయాణించనున్నారు. ఈ 52 రోజుల్లో వీరు 3200 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. గంగానది, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కొనసాగే ఈ ప్రయాణం జనవరి 13న వారణాసిలో ప్రారంభమై.. మార్చి 1న అస్సాంలోని దిబ్రూగఢ్ లో ముగియనుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలో ఇంతవరకు ఇలా రెండు పెద్ద నదులపై క్రూయిజ్ (షిప్)లో పర్యాటన జరిపిన సందర్భాలు లేవని.. అందుకే గంగ, బ్రహ్మపుత్రలపై జరిగే ఈ పర్యాటకయాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలోని అందమైన ప్రదేశాలను ప్రపంచానికి చూపించేందుకు ఈ క్రూయిజ్‌ను రూపొందించినట్లు పీఎం కార్యాలయం తెలిపింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నది ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గౌహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాల సందర్శనలతో క్రూయిజ్ ప్లాన్ చేయబడింది. ఈ ప్రయాణం పర్యాటకులకు భారతదేశం, బంగ్లాదేశ్‌ల కళ, సంస్కృతి, చరిత్ర, ఆధ్యాత్మికతలో అనుభవపూర్వకమైన సముద్రయానం చేయడానికి అద్భుతమైన అనుభూతిని కలుగజేయనుంది. రివర్‌ క్రూయిజ్‌ టూరిజమ్‌ను ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి ప్రయత్నానికి అనుగుణంగా భారతదేశంలో కొత్త పర్యాటక యుగానికి నాంది పలుకుతుందని ప్రధాని కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.వారణాసిలోని ‘టెన్త్ సిటీ’ని గంగా నది ఒడ్డున రూపొందించి, ఈ ప్రాంతంలోని పర్యాటక అవకాశాలను ఉపయోగించుకునేందుకు రూపొందించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

ఈ ప్రాజెక్ట్ నగర ఘాట్‌లకు ఎదురుగా అభివృద్ధి చేయబడింది. ఇది వసతి సౌకర్యాలను అందిస్తుంది. వారణాసిలో పెరిగిన పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దీనిని ఏర్పాటు చేస్తున్నారు. దీనిని వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసింది. పర్యాటకులు చుట్టుపక్కల ఉన్న వివిధ ఘాట్‌ల నుండి పడవల ద్వారా ‘టెన్త్ సిటీ’కి చేరుకుంటారు. ‘టెన్త్ సిటీ’ ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి జూన్ వరకు అందుబాటులో ఉంటుంది. వర్షాకాలంలో నది నీటి మట్టం పెరగడం వల్ల మూడు నెలల పాటు అక్కడికి ఎవరూ వెళ్లేందుకు అనుమతులు లేవు.

 

Bed

ఇతర ప్రాజెక్టులతో పాటు, పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా మల్టీ మోడల్ టెర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ కింద ఇది అభివృద్ధి చేయబడింది. ఇది సంవత్సరానికి సుమారు మూడు మిలియన్ మెట్రిక్ టన్నుల (MMTPA) కార్గో నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. బెర్త్‌లు సుమారు 3000 డెడ్‌వెయిట్ టన్నుల (DWT) వరకు నౌకలను నిర్వహించడానికి రూపొందించబడ్డాయి.

ఘాజీపూర్ జిల్లాలోని సైద్‌పూర్, చోచక్‌పూర్, జమానియా, ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని కాన్స్‌పూర్‌లో నాలుగు తేలియాడే కమ్యూనిటీ జెట్టీలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పాట్నా జిల్లాలోని దిఘా, నక్తా దియారా, బార్హ్, పానాపూర్, బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని హసన్‌పూర్‌లో ఐదు కమ్యూనిటీ జెట్టీలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ఈ ప్రాంతంలోని స్థానిక కమ్యూనిటీల జీవనోపాధిని మెరుగుపరచడానికి 60కి పైగా కమ్యూనిటీ జెట్టీలను గంగా తీరాన నిర్మిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

Kollegio Neo: తక్కువ ధరకే మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజ్ ఎంతో తెలుసా?

కమ్యూనిటీ జెట్టీలు చిన్న రైతులు, మత్స్య యూనిట్లు, అసంఘటిత వ్యవసాయ ఉత్పత్తి యూనిట్లు, తోటల పెంపకందారులు, పూల వ్యాపారులు, గంగా లోతట్టు ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి సారించే సాధారణ లాజిస్టిక్స్ పరిష్కారాలను అందించడం ద్వారా ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గౌహతిలో నార్త్ ఈస్ట్ కోసం మారిటైమ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇది ఈశాన్య ప్రాంతంలో గొప్ప ప్రతిభను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. అభివృద్ధి చెందుతున్న లాజిస్టిక్స్ పరిశ్రమలో మెరుగైన ఉపాధి అవకాశాలను అందిస్తుంది. వీటితో పాటు గౌహతిలోని పాండు టెర్మినల్‌లో ఓడ మరమ్మతు సౌకర్యం, ఎలివేటెడ్ రోడ్డుకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని పీఎంవో తెలిపింది.