NTV Telugu Site icon

ఆ గాయకుడు తనని గాయపరిచాడంటూ కేసు పెట్టిన భార్య!

పంజాబీ పాప్ సింగర్ యో యో హనీ సింగ్ పై గృహ హింస కేసు నమోదైంది. ఆయన భార్య శాలినీ తల్వార్ దిల్లీలోని తిస్ హజారీ మెట్రోపాలిటన్ కోర్టుని ఆశ్రయించింది. ఆమె హనీ సింగ్ పై డొమెస్టిక్ వయొలెన్స్, సెక్సువల్ వయొలెన్స్, మెంటల్ హరాజ్మెంట్, ఫైనాన్షియల్ వయొలెన్స్ ఆరోపణలు చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్‌ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం కింద హనీ సింగ్ పై శాలినీ ఆగస్ట్ 3న కేసు నమోదు చేసింది.

Read Also: మాధవన్ నుంచీ వరుణ్ ధావన్ దాకా… శిల్పాకు సినీ సెలబ్స్ మద్దతు!

హనీ సింగ్ పై ఆయన భార్య ఆరోపణల్ని పరిశీలించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్ 28 లోగా బాలీవుడ్ గాయకుడు సమాధానం ఇవ్వాలని పేర్కొంది. అంతే కాదు, హనీ సింగ్ తాము ఇద్దరి పేర్ల మీద ఉన్న సంయుక్త ఆస్తుల్ని కానీ, డబ్బుని కానీ ఏమీ చేయకూడదని న్యాయస్థానం ఆదేశించింది.

Read Also: సత్య ‘వివాహ భోజనంబు’తో సోనీ లైవ్ బోణీ!

2014లో యో యో హనీ సింగ్ తన భార్యని ‘ఇండియాస్ రా స్టార్’ అనే షోలో అందరికీ పరిచయం చేశాడు. అప్పట్నుంచీ ఆమె సొషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. అయితే, గతంలో హనీసింగ్ తో హ్యాపీ మూమెంట్స్ ని ఫోటోలు, వీడియోల రూపంలో షేర్ చేసే ఆమె… కొన్నాళ్లుగా రకరకాల మాటలతో పోస్టులు పెడుతోంది. భార్యాభర్తల నడుమ వ్యవహారం చెడిందని కొన్నాళ్లుగా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే, శాలినీ కోర్టుకు వెళ్లటంతో ఇప్పుడు వీరి పెళ్లి పెటాకుల స్థితి దాకా వచ్చేసింది. చూడాలి మరి, భార్య ఆరోపణలపై బీ-టౌన్ టాప్ పాప్ సింగర్ ఎలా స్సందిస్తాడో!