తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి. కమల్ హాసన్ పార్టీ ఒక్కచోట కూడా గెలుపొందలేక పోయింది. కమల్ మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. లోకేశ్ కనకరాజ్ తో చేస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా ‘విక్రమ్’ ను పట్టాలెక్కించబోతున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళంలో ‘తుగ్లక్ దర్బార్, 19(1)a, కడైసీ వ్యవసాయి, మామణిదన్, ముంబైకార్’ వంటి సినిమాలతో పాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి కమల్ తో నటించటం కన్ ఫామ్ అట. కమల్ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తగ్గగానే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించబోతున్నట్లు టాక్. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందట.
కమల్ ‘విక్రమ్’లో విజయ్ సేతుపతి
