NTV Telugu Site icon

ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్

1951సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రథమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞం గా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యముతో ఈ సినిమా రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన రామచంద్రారెడ్డి జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కు ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.