నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేని మూవీ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో మూవీ నిర్మిస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించబోతున్నాడు. క్రాక్
తో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన మలినేని గోపీచంద్… బాలకృష్ణ చిత్రానికి తానే కథను సైతం సమకూర్చు కుంటున్నాడు. క్రాక్
తరహాలోనే రియల్ ఇన్సిడెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుందట. విశేషం ఏమంటే… క్రాక్
లో జయమ్మ పాత్రకు జీవంపోసిన శరత్ కుమార్ డాటర్ వరలక్ష్మి… బాలయ్య బాబు చిత్రంలోనూ ఓ కీ-రోల్ పోషించబోతోందని తెలుస్తోంది. మన కథానాయికలు కొందరికి కోలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు లభిస్తున్నట్టుగానే… వరలక్ష్మీ శరత్ కుమార్ కు తెలుగులో దర్శక నిర్మాతలు డిఫరెంట్ క్యారెక్టర్స్ ను ఆఫర్ చేస్తున్నారు. దాంతో కొంతకాలంగా వర తెలుగు సినిమాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే తెనాలి రామకృష్ణ
మూవీలో నటించిన వరలక్ష్మి ఈ యేడాది క్రాక్
తో పాటు నాంది
లోనూ అద్బుతమైన పాత్రను పోషించి, నటిగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్ని దోచుకుంది. ఇక మాస్ హీరో బాలకృష్ణ చిత్రంలో నటించే అవకాశం రావడంతో వర ఇంకెంత రెచ్చిపోతుందో చూడాలి.
బాలయ్య చిత్రంలో జయమ్మ
