NTV Telugu Site icon

‘వనంగమూడి’ టీజర్ : అరవింద్ స్వామి సజీవంగా పట్టుబడతాడా?

అరవింద్ స్వామి మరోసారి తెర మీదకు రాబోతున్నాడు. ఒకప్పటి ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఫుల్ బిజీ. అంతే కాదు, మణిరత్నం నిర్మాణంలో సిద్ధమవుతోన్న ‘నవరస’ వెబ్ సిరీస్ లో ఒక సెగ్మెంట్ కి దర్శకుడు కూడా! అయితే, చేతి నిండా ప్రాజెక్టులతో యమ బిజీగా ఉన్న మల్టీ టాలెంటెడ్ అరవింద్ స్వామి ఎప్పట్నుంచో డిలే అవుతోన్న ‘వనంగమూడి’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

2017లో సెల్వ డైరెక్షన్ లో మొదలైంది ‘వనంగమూడి’. అరవింద్ స్వామి పోలీస్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్. అయితే, వివిధ కారణాలతో సినిమా బాక్సాఫీస్ వద్దకు ఇంత కాలం రాలేదు. తాజాగా ‘వనంగమూడి’ టీజర్ వదిలారు ఫిల్మ్ మేకర్స్. ఆసక్తికరంగా సాగిన 59 సెకన్ల వీడియోలో ‘హూ ఈజ్ హి?’ అంటూ కొశన్ మార్క్ తో సస్పెన్స్ క్రియేట్ చేశారు. అరవింద్ స్వామి క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉండబోతోందని ఇట్టే తెలిసిపోతుంది!
‘వనంగమూడి’ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. ‘కమింగ్ సూన్’ అంటూ టీజర్ ఎండ్ చేశారు దర్శకనిర్మాతలు. చూడాలి మరి, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం పొందుతుందో, ఈ మచ్ డిలేయ్డ్ ప్రాజెక్ట్…