Site icon NTV Telugu

ఉపాసనకు ముందస్తు బర్త్ డే విషెస్

మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కు జూలై 20తో 32 సంవత్సరాలు నిండుతాయి. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అంతేకాదు… ఉపాసనకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంచి మనసున్న మనిషి, పరోపకారి, సామాజిక కార్యకర్త అయిన ఉపాసన భావాలకు తగ్గట్టుగానే చెర్రీ అభిమానులు పలు కార్యక్రమాలు చేయబోతున్నారు. అపోలో లైఫ్ వైస్ ఛైర్మన్ గానే కాకుండా బి పాజిటివ్ మేగజైన్ చీఫ్ ఎడిటర్ గానూ ఉపాసన సేవలు అందిస్తున్నారు. దానితో పాటు యూ ట్యూబ్ ఛానెల్ ద్వారాను ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో టిప్స్ ను ఉపాసన అందిస్తుండటం విశేషం.

Exit mobile version