NTV Telugu Site icon

Unstoppable With NBK: అవి మార్ఫింగ్ వీడియోలు.. అలిగిన బాలయ్య.. కాజల్‌కి షాకిచ్చిన శ్రీలీల!

Aha Video Unstoppable With Nbk

Aha Video Unstoppable With Nbk

Unstoppable With NBK Limited Edition First Episode: అన్‌ స్టాపబుల్ షోతో కొత్త అవతారం ఎత్తిన బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్’(అన్‌స్టాపబుల్ సీజన్3)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈరోజు ఈ సీజన్ కు చెందిన మొదటి ఎపిసోడ్ స్ట్రీమ్ అయింది. ‘ఆహా’లో స్ట్రీమ్ అవుతున్న ఈ మొదటి ఎపిసోడ్లో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ మూవీ టీమ్‌తో స్పెషల్ గా చిట్ చాట్ చేశాడు. ఇక ఈ ఎపిసోడ్లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీలా, విలన్ అయిన బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా, అంతే సరదాగా సాగింది. సినిమాను ప్రమోట్ చేస్తూనే బాలకృష్ణ తనదైన శైలిలో పొలిటికల్ పంచ్‌లు కూడా వేస్తూ సరదాగా కనిపించారు.

చీకట్లు చిమ్మినా మళ్లీ ‘’చంద్రుడు’’ ఉదయిస్తూనే ఉంటాడు
బాలయ్య ఈ షోను ఎమోషనల్ డైలాగ్‌తో మొదలు పెట్టి ‘‘మా మాట మీకు సుపరిచితం, మా బాట సుపరిచితం, మేము ఏంటో మా వాళ్లేంటో, మా వెంట ఉండే మీకు సదా నమ్మకం, రోజులు మారినా, రుతువులు రంగులు మార్చినా, ఎన్ని అమావాస్యలు చీకట్లు చిమ్మినా మళ్లీ ‘’చంద్రుడు’’ ఉదయిస్తూనే ఉంటాడు అంటూ చెప్పుకొచ్చిన ఆయన గడ్డుకాలంలో కరుడుగట్టిన గుండె ధైర్యం, చెడ్డపని చేయలేదు అనే మానసిక స్థైర్యం, మన జీవితంలో అలుపులేని పోరాటానికి ఊతమిస్తుంది, మరపురాని గెలుపు తీరాలకు చేర్చుతుంది, ఎందుకంటే మేము తప్పు చేయలేదని మీకు తెలుసు, మేము తలవంచమని మీకు తెలుసు, మనల్ని ఆపడానికి ఎవడూ రాలేడని మీకు తెలుసు, మేము మీకు తెలుసు, మా స్థానం మీ మనసు అంటూ తన సిగ్నేచర్ డైలాగ్ చెప్పారు. గుండె బరువెక్కినా, కళ్లు చెమ్మగిల్లినా, చెదరని చిరునవ్వు పెదవికి పూయించే బాలయ్య మీ సొంతం, అనిపించింది అనేద్దాం, అనుకున్నాది చేసేద్దాం ఎవడు ఆపుతాడో చూద్దాం అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్ అయింది. ఇక అలా ఈ షోను స్టార్ట్ చేసి కాజల్, శ్రీలీలలను కొన్ని ప్రశ్నలు అడిగారు.

మా మోక్షాజ్ఞతో కూడా చేస్తావా?
శ్రీలీలా రావడంతోనే ‘‘రాగానే జెండా పాతేశావ్, అయితే బాలయ్యతో సినిమా లేదా శ్రీలీలతో తియ్యాలి, లేదా ఇద్దరితో కలిపి సినిమా తియ్యాలి’’ అని అంటూనే ‘‘ఈ అమ్మాయి అల్లరి పిల్ల, తెలివైన పిల్ల, ఇప్పుడిప్పుడే వెళ్లే పిల్ల కాదు, కాజల్ ఎన్నేళ్లు ఉంటుందో అన్నేళ్లు ఉంటుందని, కాజల్‌తోపాటు ఉంటూనే ఉంటుందనన్నారు. ఇక ఆయన మాట్లాడుతూ తాను లేని సమయంలో అనిల్, శ్రీ లీల, కాజల్ కలిసి రీల్స్ చేయడం తనకు నచ్చలేదని అంటూ మీతో ఒక ఆట ఆడుకుంటానని అన్నారు. ‘‘కాజల్ మీ అబ్బాయి నీల్ పాలు తాగకపోయినా, నీళ్లు తాగకపోయినా నా ఫొటో చూపించే ఉంటావు, గబ్బర్ వస్తాడు అన్నట్లు అంటే ఇప్పటిదాకా అనలేదు కానీ ఈసారి ట్రై చేస్తానని ఆమె కామెంట్ చేసింది. ఆ తర్వాత ఇప్పటివరకు రిలీజ్ చేయని కాజల్ స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు, ఆ తర్వాత ‘‘నువ్వు టాలీవుడ్‌లో అందరితో సినిమాలు చేసేసినట్లున్నావు, మరి మా మోక్షాజ్ఞతో కూడా చేస్తావా?’’ అని బాలయ్య అడిగితే ఆమె చేస్తానని చెప్పింది.

మొత్తం నాశనం చేయడానికి ఒకడు దిగుతాడు
మరోపక్క ‘భగవంత్‌కేసరీ’ మూవీ మేకింగ్ వీడియోలను ప్లే చేయగా అనిల్, శ్రీలీలా, కాజల్, బాలయ్య చేసిన ఫన్నీ క్లిప్స్‌ కనిపించాయి. ఇక అవి చూసి ‘‘అవన్నీ మార్ఫింగ్ వీడియోలు నేను, కాజల్ చాలా డిసిప్లిన్డ్ అనిల్, శ్రీ లీల అల్లరి వారు’’ అని కామెంట్ చేశారు. ఇక అప్పుడే విలన్‌గా నటించిన అర్జున్ రాంపాల్ ఎంట్రీ ఇవ్వగా ‘‘నాకు తెలుసు ఏం జరుగుతుందో, సినిమా అయినా లైఫ్ అయినా అంతా బాగున్నప్పుడు ఒకడు దిగుతాడు, మొత్తం నాశనం చేయడానికి, దాన్ని సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలని మళ్ళీ పరోక్షంగా ఏపీ రాజకీయాలపై సెటైర్లు వేశారు.

బెస్ట్ డెసిషన్ తీసుకున్నా
ఇక బాలకృష్ణ శ్రీలీలతో మాట్లాడుతూ సెట్‌లో గలగలా మాట్లాడతావు, మరి ఇక్కడ ఎందుకు బుద్ధిమంతురాలు అన్నట్టు కూర్చున్నావు అని అడిగితే మీరు కాజల్‌ను అడుగుతున్నారని సైలెంట్‌గా ఉన్నా అంటే ఆంధ్రవాళ్లం కల్పించుకుని పులిహోర కలిపేయాలని బాలయ్య కామెంట్ చేశారు. ఇక మీతో సినిమా అంటే నా భయాలు నాకు ఉండేవి కానీ మిమ్మల్ని కలిశాక ఆ భయాలు పోయాయని శ్రీలీల పేర్కొంది. ఇక శ్రీలీల మాట్లాడుతూ పెళ్లి సందD విడుదలైన తర్వాత కెరీర్ బిల్డ్ చేసుకొనే టైమ్‌లో ఈ అవకాశం వచ్చింది కానీ, ఇప్పుడే ఇలాంటివి చేయొచ్చా అని ఆలోచన వచ్చినా స్క్రిప్ట్ నచ్చి చేసేశా అందుకే బెస్ట్ డెసిషన్ తీసుకున్నా అని అనుకుంటున్నానని శ్రీలీల పేర్కొంది.
ఇక అనిల్ రావిపూడి కొన్ని ప్రశ్నలు వేస్తూ కాజల్, శ్రీలీలల సమాధానాల్లో ఏవైతే మీ హార్ట్‌కు దగ్గరగా ఉంటాయో మీరు వారి వైపుకు వెళ్లాలని అనిల్ చెప్పారు.

నీకంటే కొంచెం తక్కువ
ఈ సందర్భంగా బాలయ్యలో మీకు నచ్చినది ఏమిటని ఇద్దరినీ అడగగా శ్రీలీల బాలయ్యది ఓపెన్ హార్ట్, ఏదీ దాచుకోరని చెప్పింది. కాజల్ మాట్లాడుతూ మీ పేరులో ‘బాలా’కు తగినట్లే చిన్న పిల్లాడి మనస్తత్వం’’ అని చెప్పుకొచ్చింది. బాలయ్యలో మీకు నచ్చనది ఏమిటని అనిల్ అడగగానే శ్రీలీల సైలెన్స్ అని ఠక్కున సమాధానం ఇవ్వగా కాజల్ షాకై నువ్ చాలా స్మార్ట్ అంటూ పేర్కొంది. ఇక ఈ క్రమంలోనే దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్యను ఒక సందేహం అడగగా దానికి బాలయ్య అలిగానని కామెంట్ చేశారు. అనిల్ ప్రశ్నిస్తూ నేను ఏడు సినిమాలు చేసిన సాధారణ దర్శకుడిని కానీ మీరు సెట్‌లోకి రాగానే నన్ను గురువుగారు అని పిలిచారు ఎందుకు అని అడిగితే బాలయ్య మాట్లాడుతూ నువ్వు బచ్చా అయితే, నేను బాలుడిని, నీకంటే కొంచెం తక్కువని అన్నారు. ఏ డైరెక్టర్ అయినా నాకు మా నాన్నగారితో సమానం, ఎందుకంటే దర్శకుడు నా పాత్రకు ప్రాణం పోస్తాడు కాబట్టి, వారు నాకు గురువులాంటివారు కూడా అని అన్నారు. అయితే నువ్వు రాగానే ఈ ప్రశ్న అడిగావు కాబట్టి నా ఇగో హర్ట్ అయ్యింది అంటూ బాలయ్య కాస్త అలిగారు. ఇక అలా ఈ షో అంతా ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది.

Show comments