NTV Telugu Site icon

‘ద్విత్వ’లో త్రిష ఎంట్రీ కన్ ఫామ్!

‘యూ టర్న్’ దర్శకుడు పవన్ కుమార్ మూవీ ‘ద్విత్వ’లో ప్రముఖ నటి త్రిష నాయికగా నటించబోతోందనే వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడ కంఠీరవ రాజకుమార్ తనయుడు పునీత్ హీరోగా నటించే ఈ సినిమాలో త్రిషకు స్వాగతం పలుకుతున్నామంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. విశేషం ఏమంటే… ఏడేళ్ళ క్రితం పునీత్ రాజ్ కుమార్, త్రిష జంటగా ‘పవర్’ అనే సినిమా వచ్చింది. త్రిష ఆ తర్వాత మళ్ళీ కన్నడలో ఏ సినిమాలోనూ నటించలేదు. మళ్ళీ ఇంత కాలానికి తన ఫస్ట్ కన్నడ మూవీ హీరోతోనే త్రిష రెండో సినిమా చేస్తుండటం విశేషం. ‘లూసియా, యూ టర్న్’ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కుమార్ ఇటీవలే ‘కుడిఎడమైతే’ వెబ్ సీరిస్ ను డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం అది ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.