NTV Telugu Site icon

‘బెర్లిన్’లో ‘ఫెస్టివల్’… కరోనా కోరల్లోంచి యూరోపియన్ సినిమా ఔట్!

The Panorama Audience Award 2021 goes to "The Last Forest"

కరోనా తగ్గుముఖం పట్టడంతో యూరప్ లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా జర్మనీ దేశంలో ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. దాంతో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోలాహలంగా జరిగింది. ఎప్పుడూ వింటర్ లో నిర్వహించే సినీ సంబరాన్ని ఈసారి సమ్మర్ లో ఏర్పాటు చేశారు. జర్మనీ రాజధానిలో ప్రస్తుతం ఎండలు బాగా కాస్తుండటంతో ఆడియన్స్, జ్యూరి సభ్యులు వివిధ చిత్రాల్ని ఆహ్లాదకర వాతావరణంలో వీక్షించారు. ‘హర్ బచ్ మాన్’ డాక్యుమెంటరీ ప్రేక్షకుల మెప్పు పొంది అత్యుత్తమ చిత్రంగా నిలిచింది.

Read Also : కోలీవుడ్ లో నయనతార జోరు… ఒకే బ్యానర్ లో ఒకేసారి రెండు సినిమాలు!

‘హర్ బచ్ మాన్’ సినిమా ఓ టీచర్, ఆ టీచర్ తాలూకూ ఆరో తరగతి విద్యార్థుల చుట్టూ తిరిగే డాక్యుమెంటరీ. 8500 మంది ప్రేక్షకులు తిలకించి ఎంపిక చేయగా మారియా స్పెత్ దర్శకత్వం వహించిన డాక్యూ డ్రామా అవార్డ్ పొందట విశేషం. ఇక రెండో స్థానంలో ‘ఐ యామ్ యువర్ మ్యాన్’ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ నిలిచింది. మూడో ఉత్తమ చిత్రంగా ఇరాన్ డ్రామా మూవీ ‘బల్లాడ్ ఆఫ్‌ ఏ వైట్ కౌ’ ప్రశంసలు అందుకుంది. ‘2021 పనోరమా ఆడియన్స్ అవార్డ్’ విభాగంలో మరికొన్ని చాత్రాలకు బెర్లిన్ ఫెస్టివల్ లో పురస్కారాలు ప్రకటించారు. ‘ద లాస్ట్ ఫారెస్ట్’ తొలి ఉత్తమ చిత్రంగా, ‘మిగ్యుయెల్స్ వార్’ ద్వితీయ ఉత్తమ చిత్రంగా, ‘జెండరైజేషన్’ థర్డ్ బెస్ట్ మూవీగా జనం దృష్టిని ఆకర్షించాయి.

పోస్ట్ ప్యాండమిక్ టైమ్స్ లో… అమెరికా వేగంగా సాధారణ స్థితికి వస్తోంది. హాలీవుడ్ లో హడావిడి అంతకంతకూ పెరుగుతోంది. ఇక ఇప్పుడు బెర్లిన్ ఫెస్టివల్ లాంటి ఈవెంట్స్ తో యూరప్ లోనూ సినిమా రంగం మళ్లీ గాడిలో పడుతోంది…