దీపావళప్పుడు కాల్చే క్రాకర్స్ లో ‘రాకెట్స్’ ఉంటాయి. అవి వెలిగించాక ఆకాశంలోకి ఎంత పైదాకా వెళతాయో అస్సలు చెప్పలేం. స్టార్ హీరోల సినిమాలు కూడా అంతే! నిర్మాణం సమయంలోనే కాస్త బజ్ కూడా ఏర్పడితే ఇక ఏదైనా జరగొచ్చు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా అవ్వొచ్చు. అల్లు అర్జున్ స్టారర్ ‘పుష్ప’ చుట్టూ ఏర్పడుతోన్న క్రేజ్ ఇప్పుడు అలానే ఉంది…
‘పుష్ప’ సినిమాని మొదట సింగిల్ మూవీగానే తీస్తామన్నారు. తరువాత అది కాస్తా రెండు భాగాలుగా విడిపోయింది. ‘బాహుబలి’తో మొదలైన టూ పార్ట్స్ ట్రెండ్ ‘కేజీఎఫ్’ కంటిన్యూ చేస్తోంది. దాన్నే ‘పుష్ప’ ముందుకు తీసుకుపోతోంది. అయితే, దర్శకనిర్మాతలకి రెండు భాగాలుగా సినిమా తీయాలని ఆలోచన వచ్చిందంటే మేకింగ్ సమయంలో అద్భుతమైన ఔట్ పుట్ వచ్చి ఉండాలనే మనం భావించాలి. కథ, కథనం, హీరో చేసిన యాక్షన్… ఇవన్నీ డబుల్ ధమాకాకు దారి తీసి ఉండాలి. బడ్జెట్ ఎక్కువైనా నిర్మాతలు రిస్క్ తీసుకోటానికి సై అన్నారంటేనే ‘పుష్ప’ ఆర్డినరీ సరుకు కాదని డిసైడ్ అయిపోవాలి. అయితే, ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ లీక్ బన్నీ ఫ్యాన్స్ ని మురిపించేస్తోంది!
‘పుష్ప’ మూవీలో అల్లు అర్జున్ లుక్ చూసిన ఎవరికైనా ఈ సుకుమార్ డిరెక్టోరియల్ ఎంతటి యాక్షన్ థ్రిల్లరో ఇట్టే అర్థమవుతుంది. అయితే, లెటెస్ట్ గా మరికొంత స్పెల్ బౌండింగ్ యాక్షన్ యాడ్ చేయాలని సుక్కూ నిర్ణయించాడట. పైగా ఈసారి బోట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారని సమాచారం. హీరో నీటిపైన, పడవలో ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేస్తాడట. ఆ బోట్ ఫైట్ సీక్వెన్సే మూవీకి హైలైట్ అవుతుందని అంటున్నారు. అందుకు కోసం ప్రత్యేకంగా పలువురు స్టంట్ కొరియోగ్రాఫర్స్ రంగంలోకి దిగుతున్నారట!
‘పుష్ప’ ప్రధానంగా తెలుగు ఆడియన్స్ ని టార్గెట్ చేసినా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఏక కాలంలో విడుదలవ్వబోతోంది. చూడాలి మరి, సినిమా రీలీజ్ అయ్యాక సదరు బోట్ సీక్వెన్స్ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో!