కరోనా సెకండ్ వేవ్ తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రసీమలో నటీనటులు కొందరు పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా తమిళ నటి, పాపులర్ బుల్లి తెర భామ సహనా పెళ్ళి చేసుకుంది. ఈ అమ్మడి వివాహం జూలై 16న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో చెన్నయ్ లోని ఓ దేవాలయంలో సింపుల్ గా జరిగింది. అయితే… ఆగస్ట్ 1న వివాహానికి సంబంధించిన వీడియోను సహన తొలిసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘డాక్టర్ వెడ్స్ యాక్టర్’ అనే కాప్షన్ తో ఆమె పెట్టిన పోస్ట్ చూసిన వారికి సహన భర్త అభిషేక్ వైద్యుడనే విషయం అర్థమై పోతోంది. విశేషం ఏమంటే… ఈ జంట వివాహానంతరం హనీమూన్ కు మనాలి వెళ్ళారు. అక్కడి రొమాంటిక్ ఫోటోలు, వీడియోలను అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.
A post shared by Sahana (@actresssahanaa)