హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ట్యాక్సీ’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ ‘ట్యాక్సీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతు న్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని చెబుతున్న చిత్ర బృందం ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అంతా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి.
ఇప్పుడు అదే బూస్టింగ్‌తో ‘ట్యాక్సీ’ నుంచి ‘వేవేలా తారల’ లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్, రమ్య బెహరా పాడిన ఈ పాటలో హీరోహీరోయిన్స్ మధ్య షూట్ చేసిన సన్నివేశాలు, మ్యూజిక్ హైలైట్ అవుతున్నాయి. ప్రేమికుల ఫీలింగ్స్ తెలిసేలా కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ పాటతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. బిక్కి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో వసంత్ సమీర్ పిన్నమరాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతాన్ని, ఉరుకుండారెడ్డి ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.