Site icon NTV Telugu

Sreeleela : ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్రీలీల.. ఫోటోలు వైరల్..

Sreeleela Indrakeeladri

Sreeleela Indrakeeladri

విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భగవంత్ కేసరి చిత్ర బృందం శనివారం దర్శించుకుంది. హీరోయిన్ శ్రీలీలా ఆమె తల్లి, చిత్ర దర్శకుడు అనిల్ రావీపూడితో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు..

అనంతరం ఆలయ అధికారులు వారిని సత్కరించి అన్న, ప్రసాదాలను అందజేశారు.. శ్రీలీలా తో సెల్ఫీలు దిగడానికి భక్తులు ఎగబడ్డారు.. హీరోయిన్ అందరితో మాట్లాడుతూ ఓపిగ్గా సెల్ఫీలు దిగారు.. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే దసరా కానుకగా బాలయ్య, శ్రీలీలా నటించిన భగవంత్ కేసరి సినిమా విడుదలైంది.. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. ఇక శ్రీలీలా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తుంది.. ప్రస్తుతం తొమ్మిది సినిమాలు చేతిలో ఉన్నాయని తెలుస్తుంది..

 

Exit mobile version