సోనూ సూద్ ఈ పేరు వింటే భారతీయులు ఒళ్లు పులకరిస్తుంది. తమ కోసం ఒకరు ఉన్నారన్న భరోసా కలుగుతుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని స్వంత ఖర్చులతో వారి ఊర్లకు పంపించారు సోనూసూద్. ఆక్సిజన్ కొరత ఉన్నచోట్ల సిలిండర్లు సమకూర్చడం, ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి చూపించడం ద్వారా పేదల పాలిట దేవుడు అయ్యరు సోనుసూద్. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా తన పేరు మార్మోగుతుంది. మరోవైపు సోనుసూద్ ఇప్పటికి తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తునే ఉన్నారు.
Read Also: సినీ పరిశ్రమకు ఇక అన్నీ మంచిరోజులే : నాగార్జున
సాయం అన్నవారికి నేను ఉన్నానంటూ అండగా నిలుస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందిని ఆదుకోని మానవత్వాన్ని చాటుకున్న సోనూసూద్ ట్విట్టర్‌లో అరుదైన మైలురాయిని సాధించారు. అతను మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో 11 మిలియన్ల మంది అనుచరుల మార్క్‌ను సాధించాడు. భారతదేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో ఒకడిగా నిలిచాడు. అంతే కాకుండా ట్విట్టర్‌లో ఆయన చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తారు సోనూసూద్.
