NTV Telugu Site icon

మూడేళ్లుగా కాపురం… కళ్యాణం మూడ్ ఇంకా రాలేదట!

బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించినంత వరకూ కాపురం పర్సనల్ ఇష్యూ. పెళ్లి మాత్రం పబ్లిక్ ఇష్యూ. చాలా మంది ఈ తరం బీ-టౌన్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ డేటింగ్ ల పేరుతో కాపురాలు పెట్టేస్తున్నారు. కళ్యాణాలు మాత్రం వాయిదా వేస్తూ వస్తున్నారు. రణబీర్, ఆలియా ప్రేమ వ్యవహారం ఇలాంటిదే! ఆర్జున్ కపూర్, మలైకా అరోరా సంగతి కూడా దాదాపుగా అంతే. మరి ఈ లిస్టులో ఇంకా ఎవరున్నారు? ఫర్హాన్ అఖ్తర్, శిబానీ దందేకర్…

Read Also: దేశం కాని దేశంలో… విదేశీ నగరంలో… అర్థరాత్రి వేళ కంగనా!

నటుడిగా, దర్శకుడిగా రెండు విధాల పేరున్న ఫర్హాన్ ఇంతకు ముందు అధునా బబానీని పెళ్లాడాడు. తరువాత ఆమె పెళ్లి కాస్తా పెటాకులయ్యాక శిబానీ దందేకర్ తో ప్రేమలో పడ్డాడు. శిబానీ నటీ, మోడల్, హోస్ట్ గా బాలీవుడ్ లో ఫేమస్. అయితే, ఫర్హాన్ తో ఆమె రొమాన్స్ మూడు ఏళ్లుగా సాగుతోంది. అందుకే, వీరి పెళ్లి ఎప్పుడా అని బాలీవుడ్ తీవ్రంగా ఎదురు చూస్తోంది. మీడియాలోనూ లవ్ బర్డ్స్ ఇద్దరి మ్యారేజ్ రూమర్స్ అప్పుడప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటాయి!

Read Also: నవీన్ పోలిశెట్టి చొరవతో ఉద్యోగం పొందిన యువకుడు

ఫర్హాన్ తో పెళ్లి గురించి చివరకు శిబానీ దందేకర్ ఈ మధ్య నోరు విప్పింది. అందరూ ఆశించిన గుడ్ న్యూస్ ఏమీ ఆమె చెప్పలేదు. “అసలు మేం ఇంత వరకూ పెళ్లి గురించి మాట్లాడుకోనే లేదు”అనేసింది! చూడబోతే, ఫర్హాన్, శిబానీ ఇప్పుడప్పుడే తమ రిలేషన్ అఫీషియల్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపించటం లేదు. అసలు వాళ్లు ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారా అనేది కూడా డౌటే! అయితే, ఇటువంటి పెళ్లి కాని ప్రేమ జంటలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి…