NTV Telugu Site icon

దక్షిణాది దర్శకుడితో బాలీవుడ్ బాద్షా చర్చలు…

Shah Rukh Khan to team up with Atlee

సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో హల్ చల్ చేయటం కొత్తేం కాదు. ఈ మధ్యే విడుదలైన సల్మాన్ ఖాన్ స్టారర్ ‘రాధే’ కూడా దక్షిణాది నుంచీ ముంబై వెళ్లిన ప్రభుదేవా డైరెక్ట్ చేశాడు. అయితే, కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ మాత్రం పెద్దగా దక్షిణాది దర్శకులతో పని చేయలేదు. కానీ, త్వరలో బాద్షా ఓ చెన్నై ఫిల్మ్ మేకర్ తో జత కట్టనున్నాడట!

షారుఖ్, డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ పై చాలా రోజులుగా చర్చ సాగుతోంది. బాలీవుడ్ మీడియా కొన్నాళ్ల పాటూ ఈ మూవీ గురించి వరుసగా కథనాలు అందించింది. కానీ, మళ్లీ ఏమైందోగానీ ‘జీరో’ మూవీ తరువాత భారీ గ్యాప్ తీసుకున్న ఎస్ఆర్కే ‘పఠాన్’ సినిమాతో తిరిగి మేకప్ వేసుకున్నాడు. నిజానికి అట్లీ సినిమానే ముందుగా చేస్తాడని ప్రచారం సాగింది. కాకపోతే, ఇప్పుడు మళ్లీ తమిళ దర్శకుడితో కింగ్ ఖాన్ సినిమా అంటూ ప్రచారం జోరందుకుంది. లాస్ట్ మంత్ మన డైరెక్టర్ బాలీవుడ్ స్టార్ కి కంప్లీట్ స్క్రిప్ట్ కూడా వినిపించాడట.

అట్లీ, షారుఖ్ సినిమాపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. కానీ, ప్రాజెక్ట్ మాత్రం ముందుకు కదులుతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతా అనుకున్నట్టు వర్కవుటైతే ‘పఠాన్’ తరువాత ఈ సంవత్సరం చివరికల్లా అట్లీ సినిమా సెట్స్ మీదకి వెళ్లవచ్చు. అయితే, ఎస్ఆర్కే డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీకి కూడా సినిమా చేయాల్సి ఉంది. అది ముందుగా పట్టాలెక్కితే అట్లీ మరికొన్నాళ్లు వెయిటింగ్ లిస్టులో ఉండక తప్పకపోవచ్చు…