సీనియర్ బ్యూటీ కాజల్, కళ్యాణం తరువాత కూడా, జోరు తగ్గించటం లేదు. తెలుగు నుంచీ హిందీ దాకా పెద్ద హీరోల ఫేవరెట్ ఛాయిస్ అయిపోతోంది 35 ఏళ్ల మిసెస్ కిచ్లూ! తెలుగులో మెగాస్టార్ పక్కన ‘ఆచార్య’ మూవీ చేస్తోన్న అందాల భామ తమిళంలోనూ మరో సూపర్ సీనియర్ హీరో కమల్ తో ‘ఇండియన్ 2’లో కలసి నటిస్తోంది. ఇప్పుడిక బాలీవుడ్ నుంచీ కూడా ఓ టాప్ హీరో ఆహ్వానం పంపాడట!
గతంలో అజయ్ దేవగణ్ తో కాజల్ ‘సింగం’ సినిమా చేసింది. ఇప్పుడు మరోసారి బీ-టౌన్ సీనియర్ స్టార్ తో రొమాన్స్ చేయనుందట. పైగా అది సౌత్ మూవీ రీమేక్ కావటం మరింత విశేషం! కార్తీ హీరోగా నటించిన 2019 మూవీ ‘ఖైదీ’ గుర్తుందిగా… అది హిందీలో అజయ్ రీమేక్ చేయబోతున్నాడు. అందులో కాజల్ హీరోయినట! ఒరిజినల్ తమిళ వర్షన్ ‘ఖైతీ’లో నిజానికి హీరోయిన్ పాత్ర లేదు. తమిళం, తెలుగు భాషల్లో కార్తీ నటించిన ‘ఖైదీ’ మూవీ కథానాయిక లేకుండానే అలరించింది. అయితే, బాలీవుడ్ లో మాత్రం స్క్రిప్ట్ కు ఛేంజెస్ చేసి హీరోకి భార్య పాత్రని సృష్టించబోతున్నారట! అదే క్యారెక్టర్ లో మిసెస్ కాజల్ మెరిసిపోతుందని ముంబై టాక్. చూడాలి మరి, ఈ విషయంలో కన్ ఫర్మ్ న్యూ స్ ఎప్పుడు వస్తుందో!
ఇక్కడ చిరు, కమల్… అక్కడ అజయ్ దేవగణ్… కాజల్ కావాలంటోన్న సీనియర్ స్టార్స్!
