Salaar OTT: ఓటీటీలో ప్రభాస్ సలార్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ సలార్.. గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ ను అందుకుంది.. కేజీఎఫ్ ఫెమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించింది.. పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషించాడు. బాబీ సింహా, జగపతి బాబు, టినూ ఆనంద్, శ్రియా రెడ్డి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. డిసెంబర్ 22న విడుదలైన సలార్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టింది..
ఈ సినిమా దాదాపు రూ. 700 కోట్లకు పైగా వసూల్ చేసి భారీ హిట్ ను సొంతం చేసుకుంది.. బాహుబలి తర్వాత ప్రభాస్ కు మంచి హిట్ టాక్ ను అందించింది.. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సలార్ ఓటీటీలో ఎప్పుడెప్పుడొస్తుందా? అని చాలామంది ఎదురుచూస్తున్నారు.. త్వరలోనే సినిమా ఓటీటిలోకి రాబోతుందని తెలుస్తుంది.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ప్రభాస్ నెట్‌ఫ్లిక్స్ కోసం భారీగానే చెల్లించిందని సమాచారం. ఈనేపథ్యంలో సలార్ ను త్వరలోనే ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది..
Also Read
నెట్‌ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ద్వారా సినిమా విడుదలను ప్రకటించింది.. ఖాన్సార్ ప్రజలు తమ మొదలుపెట్టొచ్చు. వాళ్ల సలార్ తిరిగి రాజ్యానికి వచ్చాడు. సలార్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది’ అని రాసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. అయితే స్ట్రీమింగ్ డేట్‌పై ఎలాంటి అధికారిక సమచారం ఇవ్వలేదు.. రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేస్తుందేమో అని తెలుస్తుంది..
The people of Khansaar can begin their celebrations. Their Salaar has returned to his kingdom.👑#Salaar is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/iSuNbKHjNv
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2024
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?