NTV Telugu Site icon

Ravi Teja: ‘టైగర్ నాగేశ్వరరావు’కు దొరకని థియేటర్లు.. మండిపడుతున్న ఫ్యాన్స్..

Tiger

Tiger

టాలివుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ దసరాకు ప్రేక్షకులకు రవితేజ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారని ట్రైలర్ ద్వారా అర్థమైంది. కొత్త దర్శకుడు వంశీ ఎంతో పరిశోధన చేసి ఒక సెలబ్రేటెడ్ థీఫ్‌ను జనాలకు చూపించే ప్రయత్నం చేశాడు.. అభిషేక్ అగర్వాల్ కూడా బాగానే ఖర్చు చేశాడు.. ఈ సినిమా కోసం బాలివుడ్ లో కూడా బాగానే ప్రచారం చేశారు.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

హిందీ మినహా మిగిలిన భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు పెద్దగా ప్రచారం కల్పించకపోవడం ఇప్పుడు ఆ సినిమాకు మైనస్‌గా మారినట్టుంది. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లు దొరకడం లేదట. ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కావడానికి ఒక్కరోజు ముందు దళపతి విజయ్ ‘లియో’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. తమిళనాడులో అన్ని థియేటర్లను ఈ సినిమా ఆక్యుపై చేసేసిందట. దీంతో నిన్నటి వరకు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు ఓకే అయిన థియేటర్లు కేవలం 27 మాత్రమేనని సమాచారం..

ఇక పోతే కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయ్ లియో సినిమా కొనుకున్న సూర్యదేవర నాగవంశీ తమ కోసం ‘భగవంత్ కేసరి’ థియేటర్లు తగ్గించే ప్రసక్తే లేదని, బాలయ్య బాబుకే ఫస్ట్ ప్రయారిటీ అని ఆ మధ్య కామెంట్ చేశారు. అంటే ఆ రెండు సినిమాలు ఓకే కానీ ఈ సినిమాలు విడుదలైన ఒక్కరోజు తర్వాత వస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’కు మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ సినిమాకు ఇచ్చిన ప్రియారిటి తెలుగు సినిమాకు ఇవ్వ లేదని రవితేజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.