NTV Telugu Site icon

“రాధే శ్యామ్” నాన్ స్టాప్ ప్రమోషన్లు ఎప్పుడంటే…!

Radhe shyam promotional content to release after market gets back

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, తెలుగు వెర్షన్లకు రెండు వేర్వేరు సౌండ్‌ట్రాక్ లు ఉన్నాయి. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్‌లో పాటలు కంపోజ్ చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ – వంశీ – ప్రమోద్ – ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఎనిమిది రోజుల షూటింగ్ మిగిలి ఉండగా, సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. మొదటి కాపీ సిద్ధమైన తర్వాత నాన్‌స్టాప్ ప్రమోషన్లు ప్రారంభమవుతాయి. ఇది పాన్ ఇండియా చిత్రం కాబట్టి ప్రస్తుతం కరోనా ఉన్న కరోనా ఎఫెక్ట్ తగ్గాక సినిమా షూటింగ్ మొదలవుతుంది. అలాగే కరోనా పరిస్థితులు మారేంత వరకు మేకర్స్ సినిమా నుంచి ఎటువంటి ప్రచార కంటెంట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా లేరు.