‘విక్టోరియాస్ సీక్రెట్’… కాస్త ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గురించి తెలిసిన అందరికీ… దీని గురించే తెలిసే ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన లోదుస్తుల విషయంలో సూపర్ క్రేజీ బ్రాండ్! ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ‘విక్టోరియాస్ సీక్రెట్’తో ఇప్పుడు మన దేసీగాళ్ ప్రియాంక కూడా చేతులు కలుపుతోంది!
పెళ్లి తరువాత ప్రియాంక జోనాస్ గా మారి అమెరికాలో సెటిలైన ఇండియన్ గ్లోబల్ బ్యూటీ రోజుకొక కొత్త విజయాన్ని అందుకుంటోంది. టెలివిజన్ షోలతో మొదలు పెట్టిన పీసీ పాప్ సాంగ్స్ పాడటం, సినిమాల్లో నటించటం, యాడ్స్ లో తళుక్కుమనటం, ఇలా చాలా చాలా చేస్తోంది. ఇక ఇప్పుడు ‘విక్టోరీయాస్ సీక్రెట్’ బ్రాండ్ కి స్పోక్స్ ఉమన్ గా కూడా జనం ముందుకు రానుంది. ప్రఖ్యాత ఇన్నర్ వేర్ సంస్థకి ఆమె ప్రచారం చేసి పెడతారు. ఆ కంపెనీకి ఇక ప్రియాంక అఫీషియల్ పార్టనర్ గా కూడా వ్యవహరిస్తుంది!
2019లో ‘విక్టోరియాస్ సీక్రెట్’ యాన్యువల్ ఫ్యాషన్ షో ముగిశాక తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అన్ని రంగాలు, అన్ని రకాల ఆకారాలు ఉన్న, సమాజంలోని అందరు స్త్రీలనీ, ఆ సంస్థ పట్టించుకోవటం లేదని కొందరు ఆక్షేపించారు. కేవలం ఫ్యాషన్ రంగంలో కనిపించే పర్ఫెక్ట్ ఫిజిక్ ఉన్న మోడల్స్ నే దృష్టిలో పెట్టుకుంటోందని ‘విక్టోరియాస్ సీక్రెట్’కు చెడ్డ పేరుంది. ఆ అపప్రద తొలిగించుకోటానికి ప్రపంచంలోని పలు దేశాల ప్రఖ్యాత మహిళలతో చేతులు కలుపుతోంది టాప్ మోస్ట్ లింజరీ బ్రాండ్! చైనా, బ్రిటన్, బ్రెజిల్ లాంటి దేశాల ఫేమస్ ఉమెన్ కూడా ‘విక్టోరియాస్ సీక్రెట్’ స్పోక్స్ ఉమన్ గా కొలాబరేషన్ కు సై అన్నారు. వారి సరసన మన ప్రియాంక కూడా చేరటం నిజంగా గొప్ప విజయమే!
ప్రియమైన లోదుస్తుల బ్రాండ్ కి… ఇక పై ప్రియాంక మాట సాయం!
