NTV Telugu Site icon

18 పేజెస్ ఫస్ట్ లుక్: ఆసక్తి రేకెత్తిస్తున్న పోస్టర్

యంగ్ హీరో నిఖిల్ నేడు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వహిస్తుండగా.. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో రాస్తున్నట్లు చాలా డిఫరెంట్‌గా ఈ పోస్టర్ ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక అనుపమ ఈ పోస్టర్ పై స్పందిస్తూ.. ‘నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది.’ అంటూ అనుపమ ట్వీట్ చేసింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.