Site icon NTV Telugu

మరో స్పోర్ట్స్ డ్రామాలో నాని ?

Nani is gearing up for another sports-based film

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న తెరపైకి రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటించబడుతుంది. తరువాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న “శ్యామ్ సింగ రాయ్” అనే చిత్రంలో నాని నటిస్తున్నారు. ఆ తరువాత నాని నటించబోయే చిత్రం గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం నాని మరో స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నారట. ఇటీవల నాని ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డ్రామా స్క్రిప్ట్ విన్నాడట. నానికి స్క్రిప్ట్ నచ్చడంతో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. ఈ ప్రాజెక్టుకు కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించాలని భావిస్తున్నారని సమాచారం. ఇక నాని స్పోర్ట్స్ డ్రామాలపై బాగానే మక్కువ కనబరుస్తున్నాడు. తన కెరీర్ ప్రారంభ దశలో “భీమిలి కబడ్డీ జట్టు” అనే కబడ్డీ ఆధారిత చిత్రంలో నటించాడు. గత కొంతకాలం క్రితం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన “జెర్సీ”తో భారీ హిట్ ను అందుకున్నాడు.

Exit mobile version