NTV Telugu Site icon

శౌర్యం చాటిన నాగ శౌర్య! ఎదురు లేని ఎన్టీఆర్!

Naga Shourya and NTR in Times Most Desirable Men-2020 List

టైమ్స్ సంస్థ ప్రతీ యేటా ప్రకటించే ‘మోస్ట్ డిజాయరబుల్ మెన్’… ప్రెస్టేజియస్ లిస్ట్ రిలీజైంది! హైద్రాబాద్ టైమ్స్ పట్టికలో టాప్ పొజీషన్ 2019లాగే 2020లోనూ విజయ్ దేవరకొండ వశమైంది! ‘లైగర్’గా రాబోతోన్న క్రేజీ హీరో తన ర్యాంక్ ని అవలీలగానే కాపాడుకున్నాడు. అయితే, ఈసారి బాగా సర్ ప్రైజ్ చేసింది మాత్రం యంగ్ హీరో నాగ శౌర్య అండ్ మన అందాల రాముడు, తారక్!

‘మోస్ట్ డిజాయరబుల్ మెన్ 2019’లో అసలు చోటే దక్కలేదు చాక్లెట్ బాయ్ నాగ శౌర్యకి. అటువంటి స్థితి నుంచీ 2020లో ఒకేసారి టాప్ 5లోకి దూసుకొచ్చాడు మన అమేజింగ్ ‘అశ్వథ్థామ’! ఇందుకు కారణం, ప్రధానంగా… నాగ శౌర్య న్యూ మ్యాన్లీ లుక్! అంతకు ముందు పక్కింటి కుర్రాడిలా కనిపించే ఆయన ‘అశ్వథ్థామ’ కోసం కండలు తిరిగిన శరీరంతో ఆశ్చర్యపరిచాడు. అమ్మాయిలు కళ్లప్పగించే చూసేలా యాబ్స్ తో మెస్మరైజ్ చేశాడు. ఇక ‘అశ్వథ్థామ’గా జుట్టు పెంచి, పైన ముడి వేయటం మరింత మ్యాచోగా మార్చేసింది. మొత్తంగా నాగ శౌర్య ‘మోస్ట్ డిజాయరబుల్ మెన్’లో అయిదోవాడిగా ఆహా అనిపించాడు…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సెన్సేషన్ సృష్టించాడు. అనూహ్యంగా 19వ ర్యాంక్ నుంచీ మూడవ స్థానానికి ఎగబాకాడు. ఇది మరే హీరో వల్ల కాలేదనే చెప్పాలి. 2019లో టాప్ 15లో కూడా లేని తారక్ ఒకేసారి టాప్ త్రీలోకి వచ్చేసి… తళుక్కుమన్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం మన కొమురం భీమ్ ప్రదర్శించిన కరుడుగట్టిన కండల రూపం జనాల్ని బాగానే ఆకట్టుకుందని చెప్పాలి!

ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ పోతినేని ఒక ర్యాంక్ పైకి ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు. రామ్ చరణ్, నాగ చైతన్య, సందీప్ కిషన్, నవదీప్ కూడా టాప్ టెన్ లో ‘మోస్ట్ డిజాయరబుల్ మెన్’గా సత్తా చాటారు. రానా, సుధీర్ బాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, కార్తికేయ, అఖిల్ అక్కినేని… వీరంతా టాప్ టెన్ కి ఆవల, టాప్ ట్వంటీ లోపు అడ్జెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈ మోస్ట్ డిజాయరబుల్ మెన్ లో ఎన్టీఆర్, నాగ శౌర్య పర్ఫామెన్స్ స్పెక్టాక్యులర్ అంటున్నారు నెటిజన్స్…