హీరో కుషాల్ జాన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న చిత్రం ‘మిస్ ఇళయా’ (Ms. ILAYAA) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రొడ్యూసర్ మట్టా శ్రీనివాస్ మరియూ సహ నిర్మాత చాహితీ ప్రియా సమర్పణలో,కాస్మిక్ పవర్ ప్రొడక్షన్ బ్యానర్ లో వేముల జి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం, కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో హీరో కుషాల్ జాన్ మాట్లాడుతూ, “ఈ సినిమా కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నేను ఇలాంటి పాత్రలో చేయడం ఇదే మొదటిసారి. ఇది నా కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించే చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాను. ప్రేక్షకుల ఆదరణ కోసం ఎదురుచూస్తున్నాను,” అని తెలిపారు.
Captain America: Brave New World: తెలుగులో రిలీజవుతున్న కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్
డైరెక్టర్ వేముల జి మాట్లాడుతూ,”ఈ చిత్రం వినూత్నమైన కథతో తెరకెక్కుతుంది. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. హీరో కుషాల్ జాన్ ఈ పాత్రకు న్యాయం చేస్తారని నమ్మకంగా చెప్పగలను. మేము ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబోతున్నాము,” అని అన్నారు. ‘మిస్ ఇళయా’ (Ms. ILAYAA) సినిమా తొలి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది.