వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఈ క్రమంలో వినోద్ నువ్వుల హీరోగా నటించిన ల్యాంప్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ మంచి స్పందనను తెచ్చుకుంది. చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై ల్యాంప్ చిత్రాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ లో సముద్ర గారు నవోదయ ఫిలిమ్స్ అధినేత రవీంద్ర గోపాల్ గారు లాంఛనంగా ట్రైలర్ రిలీజ్ ని జీవీఎం శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వినోద్ ఫిలిం అకాడమీ సంస్థ ద్వారా ఘనంగా లాంచ్ చేయడం జరిగింది.
ఈ లాంచ్ లో ప్రముఖ అతిథులుగా పృథ్వీరాజ్ గారు కార్పొరేటర్ క్రాంతి గారు చలపతి గారు డైరెక్టర్ రాజశేఖర్ గారు హీరో వినోద్ నువ్వుల మధుమతి హీరోయిన్ కోటి కిరణ్ మధుమతి హీరోయిన్ అతిథుల సమక్షంలో ట్రైలర్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు సముద్ర గారు మాట్లాడుతూ, “ఫిల్మ్ అకాడమీలు పరిశ్రమకు మంచి సాంకేతిక నిపుణులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వినోద్ ఫిల్మ్ అకాడమీ కూడా తమ మార్కును చూపింది,” అన్నారు. నటులు 30 ఇయర్స్ పృద్వి, నిర్మాత శబరి మహేంద్రనాథ్, నటుడు రాజశేఖర్, యంగ్ డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.