NTV Telugu Site icon

Khushbu Sundar: ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా …

యంగ్ హీరో శర్వానంద్, హాట్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిశోరె తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్లు రాధిక, ఖుష్బూ, ఊర్వశి, సత్య, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈచిత్రంలోనటించిన సీనియర్ నటి కుష్బూ ఎమోషనల్ అయ్యారు. చాలారోజుల తర్వాత తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. చాలా సంతోషంగా వుంది. ఆడవాళ్ళు ఇంట్లో వుంటే ఎలా వుంటుందో చెప్పాల్సింది. తెలుగు సినిమాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ చాలా బాగా నటించారు. తనకున్న పాత్రను అంకితభావంతో పనిచేశాడు. కంగ్రాట్యులేషన్స్ టు శర్వానంద్. గీతాగోవిందం సినిమాలో రష్మిక నటన చూశాను. బాగా చేసింది. డైరెక్టర్ తనకు కథ చెప్పినప్పుడు రష్మిక వుంటుందని చెప్పారు.

ఈ సినిమాలో విజువల్స్ అన్నీ బాగుంటాయి. ఈ మూవీలో ఫ్యామిలీలాగా పనిచేశాను. లొకేషన్ బాగుంది. జోక్ లు వేసుకుని నటించాం. ఊర్వశి, రాధిక అంతా బాగా చేశారు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రం ఇది. ఆడవాళ్ళు కంపల్సరీ రావాలి. ఆడవాళ్ళు కుటుంబాన్ని తీసుకువచ్చి సినిమా చూపించాలి. తెలుగు సినిమాలో నటించడం నాకెంతో హ్యాపీ. రామానాయుడు గారి ఆశీస్సులు ఇచ్చారు. రాఘవేంద్రరావు గారు ఎన్నో విషయాలు చెప్పారు. సినిమా సక్సెస్ అయ్యాక మళ్ళీ కలుద్దాం అన్నారు కుష్బూ సుందర్. ఈమధ్యకాలంలో కుటుంబ కథా చిత్రాలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. మార్చి 4 న ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.