ప్రముఖ నటి, తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత బయోపిక్ ‘తలైవి’ తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యియి. తమిళంలో కట్స్ ఏవీ లేకుండానే ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. అతి త్వరలోనే తెలుగు, హిందీ వర్షెన్స్ సెన్సార్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. జయలలిత జయంతి సందర్భంగా 2019 ఫిబ్రవరి 24న ఈ సినిమాను ప్రారంభించారు.
Also Read: జలకాలాటలలో శ్రియ సరన్.. లేటెస్ట్ హాట్ స్టిల్స్
జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తోందనగానే చాలా మంది ఆశ్యర్యపోయారు. జయలలిత వ్యక్తిత్వంతో కంగనాను పోల్చవచ్చు కానీ ఆ పాత్రకు కంగనా ఎంత వరకూ న్యాయం చేకూర్చుతుందనే సందేహం వ్యక్తం చేశారు. అయితే ఒకసారి ఆ మూవీ టీజర్ విడుదలైన తర్వాత వారి సందేహాలు పటాపంచలైపోయాయి. జయలలిత బాడీ లాంగ్వేజ్ ను కంగనా ఇమిటేట్ చేసిన విధానం చూసి ఫిదా అయిపోయారు. అప్పటి నుండీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం మొదలెట్టారు. నిజానికి కరోనా సెకండ్ వేవ్ గొడవ లేకపోతే ఈ యేడాది ఏప్రిల్ 23న ఈ మూవీని విడుదల చేయాల్సింది. కానీ ఇప్పుడు అది వాయిదా పడింది. సినిమా థియేటర్లు అతి త్వరలో తెరుచుకోబోతున్న నేపథ్యంలో ఆగస్ట్ లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ‘తలైవి’ చిత్రాన్ని విష్ణువర్థన్ ఇందూరి, శైలేష్ సింగ్ నిర్మించారు.