నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్న నాటు మందును ఆయుర్వేదం ఖాతాలో వేయాలా వద్దా అని ప్రభుత్వ, వైద్య అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అది ఒక కొలిక్కి రాకపోయినా… లక్షలాది మంది ఆ మందు మీద నమ్మకంతో కరోనా బారిని నుండి బయట పడటానికి అదే కరెక్ట్ అని నమ్ముతున్నారు. పర్యవసానం ఎలా ఉన్నా ఆ మందును వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ సందిగ్థ సమయంలో ప్రముఖ నటుడు జగపతిబాబు మాత్రం ఆనందయ్య పక్షాన నిలిచారు. ఆయన తన సోషల్ అక్కౌంట్ లో ఆనందయ్యను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆనందయ్యను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోంది. ఆనందయ్యగారి వైద్యానికి అధికారిక అనుమతి రావాలని ప్రార్థిస్తున్నాను. అదే ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఆ విధంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాలి’ అని జగపతిబాబు తెలిపారు. అయితే జగపతిబాబు వ్యాఖ్యలను పలువురు సమర్థిస్తుంటే, కొందరు మాత్రం ఇలాంటి వాటిని మీలాంటి వారు సమర్థించడం తగదంటూ హితవు పలుకుతున్నారు.
ఆనందయ్యకు జగపతి బాబు సపోర్ట్!
