Site icon NTV Telugu

ఆమిర్‌ఖాన్‌ విడాకులపై ట్రోల్స్.. లవ్ జీహాద్ అంటూ?

బాలీవుడ్ స్టార్‌ కపుల్‌ ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. విడిపోవాలనుకోవడం అనేది ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ప్రారంభమని భావిస్తున్నాం అంటూ తమ లేఖలో ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావు పేర్కొన్నారు. ఇకపై కుమారుడి బాధ్యత ఇద్దరూ చూసుకోనున్నట్లు తెలిపారు. మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఆమిర్‌ఖాన్‌.. కిరణ్‌రావుని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఓ వర్గం వారిచ్చిన స్టేట్మెంట్స్ తో అర్థంచేసుకుంటుండగా.. మరికొందరు మాత్రం తీవ్రంగానే వ్యక్తిరేకిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో అమీర్ ఖాన్ పేరు ట్రెండ్ అవుతోంది.

కాగా, ఇటీవలే ప్రముఖులు విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది . రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమిర్‌ఖాన్‌ కపుల్స్ సైతం బిల్ గేట్స్ దంపతుల వలె విడాకులపై ఒకే వివరణ ఇవ్వడం గమనార్షం. ఇలాంటివాళ్ళు ఇంకెంతమందికి ఆదర్శం అవుతారో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశం లవ్ జిహాద్.. దీనిపై కూడా అమిర్ ఖాన్ పెద్దఎత్తున ట్రోల్స్ కు గురవుతున్నాడు. #AamirKhan తో సమానంగా #LoveJihad హాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతుండటాన్ని లవ్ జీహాద్ ‌గా అభివర్ణిస్తున్నారు. అయితే అమిర్ ఖాన్ విషయంలోనూ ఇదే జరుగుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమిర్ ఖాన్ ఇదివరకు ఇద్దరి హిందు మహిళలను పెళ్లి చేసుకున్నాడని.. పిల్లలకు ముస్లిం పేర్లనే పెట్టారంటూ నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇది లవ్ జిహాద్ కు సరైన నిర్వచనం అంటూ ట్విట్టర్ వార్ కు తెరలేపారు. కాగా, లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Exit mobile version