NTV Telugu Site icon

Guntur Karam Twitter Review: మహేష్ బాబు ఊరమాస్ ట్రీట్.. సినిమా ఎలా ఉందంటే?

Mahesh Cinima

Mahesh Cinima

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో అంటే ఫ్యాన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో అందరికీ తెలుసు.. ఈ కాంబోలో వచ్చిన సినిమాలు జనాలను ఆకట్టుకున్నాయి.. దాంతో ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా పై కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి.. గత కొద్ది రోజులుగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం హంగామా చేస్తున్నారు.. ఈరోజు ఎట్టకేలకు విడుదల అయ్యింది..

ఇప్పటికే సాంగ్స్‌, ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్‌పెటేషన్స్‌ పెరిగిపోయాయి. కుర్చీ మడతపెట్టి.. అనే సాంగ్‌ నెట్టింట భారీగా ట్రెండ్ అవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.. ఈరోజు విడుదలైన ఈ సినిమా పై పబ్లిక్ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నట్లు తెలుస్తుంది.. అర్ధరాత్రి 1 గంట షోలు పూర్తవ్వగా.. ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ రచ్చ చేస్తున్నారు. బాబు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు..

మహేష్ బాబు వన్‌మ్యాన్ షో.. అంటూ ట్విట్టర్‌లో గుంటూరు కారం గురించి రివ్యూలు ఇస్తున్నారు. ఇక మహేష్‌ బాబు-వెన్నెల కిషోర్ ట్రాక్‌ చాలా కామెడీ ఉందని అంటున్నారు. శ్రీలీల తన డ్యాన్స్‌తో కట్టిపడేసిందని చెబుతున్నారు.. మహేష్ స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవల్ అంటూ ట్విట్టర్ లో ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు..

ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని.. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సూపర్ అని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. కుర్చీ మడతబెట్టి సాంగ్.. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్‌ సెకండాఫ్‌లో హైలెట్‌గా నిలుస్తాయంటున్నారు. ఓవరాల్‌గా హిట్ బొమ్మ అంటూ రివ్యూలు ఇస్తున్నారు.. సినిమా అనుకున్నదానికంటే ఎక్కువే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుందని చెబుతున్నారు..