NTV Telugu Site icon

Ghost Movie: శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ తెలుగు వర్షన్ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

Ghost Movie

Ghost Movie

కన్నడ స్టార్ హీరో కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన యాక్షన్ స్పెక్టకిల్ ‘ఘోస్ట్’ ఇటీవలే విడుదలైంది.. ఆ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్ల తో దూసుకెళ్తోంది. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ లో విడుదలైన ఘోస్ట్, తొలి రోజే టెర్రిఫిక్ రివ్యూస్ తో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.. అంతేకాదు కాసుల వర్షం కురిపించింది.. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కించారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు..

ఇకపోతే అదే రోజున తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ థియేటర్స్ దొరక్క ఆపారు. దసరా సినిమాలు వేడి తగ్గటంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అవుతూ పోస్టర్ వదిలారు. ఘోస్ట్ చిత్రాన్ని నవంబర్ 4న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రమంతటా తెలుగు లో విడుదలకు సిద్ధం అవుతోంది.. స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి విడుదల చేసిన ఘోస్ట్ ట్రైలర్ కి ట్రేమెండస్ రెస్పాన్స్ వచ్చింది.

కన్నడ చిత్ర పరిశ్రమలో శివరాజ్ కుమార్ నటించిన ఎన్నో సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ సినిమా ఆ స్దాయిలో వర్కవుట్ కాలేదు. ఫస్ట్ డే కలెక్షన్లు కేవలం 4 కోట్లని ఆ మొత్తం కూడా గ్రాస్ కలెక్షన్లు అని తెలుస్తోంది.సెకండ్ డే కలెక్షన్లు కోటిన్నర రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని సమాచారం. ఆ తర్వాత బాగా డ్రాప్ అయ్యింది. శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీ కలెక్షన్ల లెక్కలు తెలిసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ సినిమా కలెక్షన్లు ఇంత తక్కువా అని నెటిజన్లు అశ్చర్యపోయారు. అయితే ఘోస్ట్ సినిమాకు పోటీగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు కర్ణాటకలో విడుదల కావడం వల్లే ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గాయని అన్నారు. మరి తెలుగులో ఏ మేరకు ఆడుతుందో చూడాలి..ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ అందించగా. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందించారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని లావిష్ స్కేల్ లో నిర్మించారు..