జి. నరసింహ గౌడ్ నిర్మాతగా, ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ చిత్రం
ఫైటర్ శివ`. మణికాంత్, శీతల్ భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ సీబీఐ ఆఫీసర్ గా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కరోనాతో ఇబ్బందులు పడుతున్న కళాకారులకు ఈ చిత్ర నిర్మాత నిత్యావసరాలను అందచేశారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయని, కారోనా తగ్గుముఖం పట్టాక చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తామని అన్నారు. పోస్టర్ లాంచ్ సమయంలో 200 మంది సినీ కార్మికులకు పది రోజులకు సరిపోయే రేషన్ ఇవ్వడం ఆనందంగా ఉందని, వారి సమక్షంలోనే పోస్టర్ నూ విడుదల చేశామని నిర్మాత నరసింహ గౌడ్ చెప్పారు.