NTV Telugu Site icon

ట్రెండింగ్ లో “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్”…!!

FamilyMan2AgainstTamils on Twitter trends

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఫ్యామిలీ మ్యాన్-2” ట్రైలర్ వచ్చేసింది. ఈ సిరీస్ పై అంచనాలను భారీగా పెంచేసింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌తో సమంత తన డిజిటల్ అరంగేట్రం చేస్తోంది. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కనిపించనుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సిరీస్‌లో సమంత రాజీ అనే శ్రీలంక తమిళ తిరుగుబాటుదారురాలిగా నటించింది. తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. శ్రీలంకలో తమిళ వాసుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సంస్థ అసలు టెర్రరిస్ట్ సంస్థ కాదని, సామ్ తమిళ నటి అయ్యి కూడా ఇలాంటి పాత్రలో నటించడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు తమిళ తంబీలు.