NTV Telugu Site icon

Erracheera: ఏప్రిల్ 25న ‘ఎర్రచీర – ది బిగినింగ్’

Erracheera

Erracheera

శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా, బేబీ డమరి సమర్పణలో నిర్మితమవుతున్న చిత్రం ఎర్రచీర – ది బిగినింగ్. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 25, 2025న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ఈ చిత్రంలో నటిస్తుండగా, దర్శకుడు సుమన్ బాబు స్వయంగా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. తల్లి సెంటిమెంట్‌తో పాటు హారర్, యాక్షన్ అంశాలను మేళవించిన ఈ సినిమా, మొదట శివరాత్రి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ, సాంకేతిక కారణాల వల్ల ఆ షెడ్యూల్ వాయిదా పడింది. ఇప్పుడు వేసవి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి టీమ్ పక్కా ప్లాన్‌తో సన్నద్ధమవుతోంది.

నిర్మాత ఎన్ వివి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం అద్భుతంగా తీర్చిదిద్దాము. అఘోరాలతో శివుడిని చూపించే ఒక సీక్వెన్స్ షూట్ చేశాం, అది అద్భుతంగా వచ్చింది. ఇది కుటుంబంతో సహా పిల్లలు కూడా ఆనందించే సినిమా అవుతుంది,” అని తెలిపారు. దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ, “ఈ సినిమాలో 45 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికే సినిమా చూసిన వారు దీన్ని అద్భుతంగా మెచ్చుకున్నారు. విడుదల ఆలస్యమైనప్పటికీ, కంటెంట్ మాత్రం దిమ్మతిరిగేలా ఉందని అందరూ అంటున్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక అసాధారణ అనుభూతిని పంచుతుందని ఆశిస్తున్నాం,” అని చెప్పారు. ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతోంది.