NTV Telugu Site icon

Devil Movie : ‘డెవిల్’ నుంచి ‘దిస్ ఈజ్ లేడీ రోజ్…’ సాంగ్ రిలీజ్..

Lady Rose Song

Lady Rose Song

బింసారా వంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటినస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్’.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ రూపొందిస్తోన్న పీరియాడిక్ స్పై థ్రిల్లర్ గా సినిమా తెరకేక్కుతుంది.. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన కల్యాణ్‌రామ్, మాళవిక నాయర్, ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ నుంచి కొన్నాళ్లుగా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త న్యూస్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌ కోసం నయా అప్‌డేట్‌ బయటకు వచ్చింది..

రీసెంట్‌గా రిలీజైన ‘డెవిల్’ మూవీ టీజర్‌, ‘మాయ చేశావే..’ సాంగ్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమా నుంచి ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ అనే లిరికల్ వీడియోను సెకండ్ సాంగ్‌గా రిలీజ్ చేశారు. ఈ పాటను ‘జవాన్’ చిత్రంలో టైటిల్ ట్రాక్‌తో ఆకట్టుకున్న లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ రాజకుమారి పాడటం విశేషం. ఆమె ఎనర్జిటిక్ వాయిస్ పాటకు మరింత ఎట్రాక్షన్‌గా మారింది.

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహించిన డెవిల్ సినిమాలో ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యాన్ని అందించగా రాజకుమార్ ఆలపించారు. బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ ఈ పాటలో అప్పియరెన్స్, డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో నందమూరి కళ్యాణ్ రామ్ తెలుపు రంగు సూట్ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ సాంగ్ థియేటర్స్‌లో ఆడియెన్స్‌కి కళ్లకు విందులా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. గాంధీ నడికుడికర్ ఈ సినిమాకు ప్రొడఓన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహించారు. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది..

Show comments