NTV Telugu Site icon

ప్రపంచాన్ని శివుడు కాపాడతాడంటున్న దేవిశ్రీ ప్రసాద్…

దేవిశ్రీప్రసాద్ మంచి సంగీతదర్శకుడే కాదు అద్భుతమై ఫోటో గ్రాఫర్ కూడా. తన కెమెరాతో ప్రకృతిని బంధించటం అంటే సరదా దేవిశ్రీకి. అంతే కాదు తను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్చే స్తుంటాడు. అలా ఇప్పటికే పలుసందర్భాలలో ప్రశంసలు కూడా అందుకున్నాడు. దేవికి దైవభక్తి కూడా మెండే. అదివారం దేవిశ్రీ ఆకాశంలో శివరూపాన్ని చూశాడు. ఆ రూపాన్ని కెమెరాతో బంధించి సోషల్మీ డియలో పోస్ట్ చేశాడు. దానికి చక్కటి క్యాప్షన్ కూడా జోడించాడు. శివ ఇన్ ద స్కై అంటూ ‘ఈ పాండమిక్ సిట్యుయేషన్ నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి వస్తున్నాడు’ అని పోస్ట్ చేశాడు. అంతే కాదు ఇటీవల తన మ్యూజిక్ తో మేజిక్ చేసి ‘ఉప్పెన’ ఘన విజయంలో భాగం అయిన దేవిశ్రీ… ఆ సినిమాలోని ‘ఈశ్వరా పరమేశ్వరా’ను కూడా మెన్షన్ చేశాడు. ప్రస్తుతం దేవిశ్రీ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.